టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వరసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో దే దే ప్యార్ దే సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా విజయం తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు బాట పట్టాయి. ఈ సినిమాను టాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మన్మథుడు2 సినిమా చేస్తున్నారు.
మన్మధుడు2లో రకుల్ స్మోక్ చేసే సన్నివేశం ఉంది. దీనిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. స్మోక్ చేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి రకుల్ చెప్పిన సమాధానం షాక్ కు గురిచేస్తుంది. బాలీవడ్ లో షాహిద్ కపూర్ కు స్మోకింగ్ చేసే అలవాటు లేదు. ప్యూర్ వెజిటేరియన్. కానీ.. కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ చైన్ స్మోకర్ గా, డ్రింక్ చేస్తూ దర్శనమిస్తాడు. అలాగే.. కథ డిమాండ్ ను బట్టి మాత్రమే అలా చేయాల్సి వస్తోందని రకుల్ ప్రీత్ సింగ్ వివరించారు.