యు.వి.క్రియేషన్స్ సంస్థ ఒకవైపు భారీ చిత్రాలను నిర్మిస్తూనే మరోవైపు మినిమమ్ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ ముందుకెళ్తోంది. ఇక ప్రభాస్ తో దాదాపు 300 కోట్లతో భారీ బడ్జెట్ సినిమా చేస్తోన్న ఈ సంస్థ మరో మినిమమ్ బడ్జెట్ లో నాగ చైతన్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణార్జునుల యుద్ధం` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందట. ఇప్పటికే కొంత కాలంగా ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడట దర్శకుడు గాంధీ. ప్రస్తుతం నాగ చైతన్య `వెంకీమామ` తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వెంకీ మామ కంప్లీట్ అయింది. శేఖర్ కమ్ముల సినిమా పూర్తయ్యాక యువి క్రియేషన్స్ వారికి చైతు డేట్స్ కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.