బిగ్ బాస్ నిర్వాహకులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బిగ్ బాస్ షోనిర్వాహకులపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు నిర్వాహకులు. బంజారాహిల్స్‌లో నమోదైన కేసు కొట్టివేయాలని పిటిషనర్ కోర్టుని కోరారు. అయితే కేసు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు, పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణవచ్చే వరకు నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు.