నటీనటులు:
రామ్, నిధి అగర్వాల్, నభ నటేష్, సత్యదేవ్ తదితరులు
సంగీతం: మణిశర్మ
కెమెరా: రాజ్ తోట
దర్శకత్వం: పురీ జగన్నాధ్
నిర్మాత: పురీ జగన్నాథ్-ఛార్మి
సెన్సే షనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆడియన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు రామ్ క్యారెక్టర్ లో లీనమయ్యి మాస్ యాక్టింగ్ చేయడంతో బాటుగా తెలంగాణా యాసలో పూర్తిగా మాట్లాడటంతో.. సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. నభా నటేష్, నిధి అగర్వాల్ ల గ్లామర్ షో, తెలంగాణా యాసలో ఓల్డ్ సిటీ పక్కా మాస్ స్టోరీతో వచ్చిన ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలా ఉందో తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే….
కథ :
ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ (రామ్) పాతబస్తీలో సెటిల్మెంట్స్ చేస్తుంటాడు. ఈ టైమ్ లో ఒక సెటిల్మెంట్ విషయమై పరిచయం అవుతుంది చాందిని (నభా నటేష్). ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు రామ్. అంతేకాదు, ఇదే టైంలో పొలిటీషియన్ కాశీ రెడ్డిని చంపిన కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. జైల్ నుంచి తప్పించుకున్న శంకర్ మెదడులో ఒక చిప్ పెడుతుంది పింకీ (నిధి అగర్వాల్). అసలు ఈ చిప్ పింకీ ఎందుకు పెడుతుంది..? శంకర్ నిజంగానే పొలిటీషియన్ కాశీ రెడ్డిని చంపాడా..? శంకర్‌కి సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) కి సంబంధం ఏంటి అనేది వెండితెరపై చూసి తీరాల్సిందే..
ప్లస్ పాయింట్స్..
ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ప్లస్ పాయింట్ కథ. ఒక మంచి కొత్త కాన్సెప్ట్ తో కథని అల్లాడు డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఇది సినిమాకి ప్లస్ పాయింట్. ఇక రామ్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, నిధి అగర్వాల్, నభనటేష్ గ్లామర్ సినిమాకి హైలెట్. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్స్ పోటీ పడీ మరీ గ్లామర్ షో చేసారనే చెప్పాలి. ఇక మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకి అదనపు బలం. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీసాడనే చెప్పొచ్చు.
కొన్నిసార్లు సీన్ ని డామినేట్ కూడా చేసింది ఆర్ ఆర్. ఇక రామ్ మేకోవర్, డైలాగ్ డెలివరి, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాని నిలబెట్టాయి. సత్య, ఆశిష్ విద్యార్ధి, షియాజీ షిండే ల పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్ పూరీ ఈజ్ బ్యాక్ అనిపించింది. తెలంగాణ యాసలో రామ్ మాట్లాడుతుంటే తూటాలు పేలినట్లు అనిపించాయి.
మైనస్ పాయింట్స్..
రొటీన్ మార్క్ స్క్రీన్ ప్లేతో సినిమాపై ఆసక్తిని తగ్గించేసాడు డైరెక్టర్. కాన్సెప్ట్ కొత్తగా అనిపించినా ప్రేక్షుడిని థ్రిల్ కలిగించే సన్నివేశాలు పూరి రాసుకోలేకపోయాడు. ఇదే సినిమాకి మైనస్ అయ్యింది. ఒక పాట, ఫైట్, యాక్షన్ ఇలా రొటీన్ గా వెళ్లిపోయింది సినిమా. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాలాలా కాకుండా వేరేగా ట్రే చేసి ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కాస్త ఓవర్ గా అనిపిస్తాయి. కథకి ఎలాంటి సంబంధం లేదనిపిస్తుంది. ఇక మద్యమద్యలో వచ్చే సాంగ్స్ స్క్రీన్ ప్లేని కిల్ చేసాయనే చెప్పాలి. బూతులు అవసరం లేని చోట కూడా హీరోతో పలికించడం అనేది కావాలని చేసినట్లుగా ఉంది. ఇస్మార్ట్ శంకర్.. డబుల్ దిమాక్ వచ్చిన తర్వాత అక్కడక్కడా కన్ఫ్యూజన్ వచ్చినట్లనిపించింది. ఎవరు ఎప్పుడొస్తారు.. ఎందుకొస్తారు.. అనేది లాజిక్ ఉండదు.
ఓవరాల్‌గా చూస్తే..రామ్ రెచ్చిపోయాడు....పూరీ హిట్టు కొట్టేశాడు . కానీ 'ఇస్మార్ట్' మాస్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితం.
రేటింగ్: 2.75/5