గొప్ప కథలను తెరకెక్కించేందుకు, నటించేందుకు ఇదే మంంచి సమయమంటోంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఇటీవల విజయాలు సాధిస్తున్న వినూత్న సినిమాలే ఇది నిజమని నిరూపిస్తున్నాయని చెబుతోంది. ఓ మంచి కథ దర్శకులను, నటులను ఎదిగేలా చేస్తుందన్నది జాక్వెలిన్ అభిప్రాయం. సినిమాలైనా, డిజిటల్ అయినా, వెబ్ సిరీస్ అయినా కథే కీలకమన్నది ఈమె మాట. ప్రస్తుతం కిక్ 2 చిత్రంలో నటిస్తున్న జాక్వెలిన్…త్వరలో డిజిటల్ స్క్రీన్ మీద అరంగేట్రం చేస్తోంది. మిసెస్ సీరియల్ కిల్లర్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఏం చేసినా కథే ముఖ్యమని చెప్పే జాక్వెలిన్ స్పందిస్తూ…ప్రతి అంశం కథ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ విషయం మీదే చాలా ఏళ్లుగా చిత్ర పరిశ్రమ కసరత్తులు చేస్తోంది. గత రెండేళ్లుగా ఈ ప్రయత్నాలు కార్యరూపం దాల్చుతున్నాయి. వాటి ఫలితాలను మనం విభిన్నమైన చిత్రాలు ఆదరణ పొందడం ద్వారా చూస్తున్నాం. కొత్త తరహా కథా కథనాలు అపూర్వ విజయాలు సాధిస్తున్నాయి. నటించేది కొత్తవాళ్లైనా చరిత్ర సృష్టించే చిత్రాలవుతున్నాయి. సినిమాలైనా, వెబ్ కంటెంట్ అయినా, డిజిటల్ అయినా ఎంచుకునే అంశమే ముఖ్యం. డిజిటల్ వేదికలు ప్రస్తుతం గొప్ప ఆదరణ పొందుతున్నాయి. దర్శకులకు, నటీనటులకు కీలక సమయమిది. అని చెప్పింది.