తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 1, సీజన్ 2ల కన్నా బిగ్‌బాస్ సీజన్ 3 ప్రసారం కాకముందే వార్తల్లో నిలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ కాదు.. బ్రోతల్ హౌస్ అంటూ సంచలన కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా మారింది బిగ్ బాస్ 3 షో. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా ఈ షోపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, రియాలిటీ షో నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ఇప్పటికే ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది.
తాజాగా ఈ వివాదంపై నటి హేమ స్పందించారు. వివరాలలోకి వెళితే ... ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బిగ్ బాస్ 3 ని ఆపలేవని అయినా ఈ షోను హోస్ట్ చేస్తున్న నాగార్జున చాలా పెద్ద మనిషి, చాలా బాధ్యతగల వ్యక్తి, ఆయన మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. కాస్టింగ్ కౌచ్ లాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఉంటే ఆయన ఈ షో చేయడానికి ఎందుకు ఒప్పుకుంటారంటూ ఈ షో కు తన మద్దతు తెలియజేసారు. ఈ వివాదానికి కారణమైన వారిని గురించి ప్రస్తావిస్తూ ఈ పరిణామాలు నెల రోజుల ముందునుంచి జరుగుతున్నప్పుడు అప్పుడే బయటకు చెప్పాలి. ఎవడైనా నన్ను ఏదైనా అంటే ఆరోజే స్పందిస్తాను. ఆ రోజే మీడియాకు ఎక్కుతా.. లేదంటే ఆరోజు వాడి కాలర్ పట్టుకుంటాను. నన్ను సెలక్ట్ చేయలేదు అన్న తర్వాత ఇలా మాట్లాడటం ఎంత వరకు న్యాయం అనేది మీరు ఆలోచించుకోవాలి..అంటూ స్పందించారు హేమ. ఇక బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో పాల్గొనాలని ఆశగా ఉన్నట్లు ఈ సందర్భంగా తెలియజేసారు హేమ. రాజకీయాల్లోకి వస్తున్న తనను ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు అనే విషయాన్ని ఇలాంటి షోలో పాల్గొని తెలుసుకోవాలని ఉంది అంటూ , ఒకవేళ అకాశం వస్తే తప్పకుండా వెళతాను తన మనసులో మాట బయటకు చెప్పారు.