ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో కన్నడ టీవీ నటి శోభ దుర్మరణం

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2019, 07:50 PM



కన్నడ టీవీ నటి శోభ, మరో నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. చిత్రదుర్గ శివారులో బుధవారం(జులై 17) ఈ ఘటన చోటు చేసుకుంది. 4వ నెంబర్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక మల్టీ పర్సస్ వెహికిల్‌లో శోభతో పాటు మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. చిత్రదుర్గ శివారులోని కుంచినగనలు వద్ద జరిగిన ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మరణించగా.... ఇద్దరు పిల్లలతో సహా మొత్తం ముగ్గురు గాయాలతో బయటపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com