ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవ్వులు పూయిస్తోన్న విద్యాబాలన్ టాక్ టుక్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2019, 08:41 PM



బాలీవుడ్ హీరోయిన్‌ విద్యాబాలన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ‘‘శాస్త్రాల ప్రకారం ప్రతి అమ్మాయిలోనూ దేవీ రూపాలు ఉంటాయి. అయితే వారిలో నుంచి ఏ సమయంలో ఏ దేవత బయటకు వస్తారన్నది మాత్రం భర్త ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది’’ అని ఎవరో చెప్పిన వాయిస్‌ను ఆమె అనుకరించింది. దీనికి టైంపాస్ కోసం టాక్ టుక్ అని కామెంట్ పెట్టింది. కాగా నవ్వులు పూయిస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దానిని లక్షన్నరకు పైగా నెటిజన్లు వీక్షించారు. అయితే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళలో విద్యాబాలన్ నటించింది. ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది. మార్స్ మిషన్‌ ప్రయోగంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీతో పాటు తమిళంలో అజిత్ సరసన నెర్‌కొండ పార్వై(పింక్)రీమేక్‌లో నటించింది. కోలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com