ముకుంద, ఒక లైలా లాంటి తెలుగు సినిమాల్లో నటించిన పూజా హెగ్డే కేరియర్ రానురాను పడిపోతుండటంతో ఇక వాడి వేడి అందాలు చూపించడమే తగిన పద్దతిగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తమిళ చిత్రం ముగమూడి చిత్రంతో వెండితెరకి వచ్చిన ఆమె హృతిక్ రోషన్‌తో బాలీవుడ్లో చేసిన మొహెంజోదారో, ఇటు తెలుగు చిత్రాలు కూడా బాక్సాఫిసుముందు బోల్తా కొట్టడంతో ఫ్లాప్ హీరోయిన్ అనే ట్యాగ్‌ను సంపాదించింది. ఆమధ్య అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాధంలో నటించినా ఫలితం దక్కలేదు. ఆ చిత్రంలో అమ్మడు రెండు-ముక్కల బికినీతో కాస్త అలరించడమే కొంత ఇండస్ట్రీ వాళ్లు చూసేలా చేసింది. సినిమా వస్తే చాలు ఇక అందాల ఆరబోతగా తప్పని సరి చేస్తానంటూ తన సన్నిహితుల వద్ద చెపుతోందట. ఈ క్రమంలోనే అమ్మడు తన సరికొత్త ఫోటో షాట్స్ అందచేసిందట. ప్రస్తుతం ఇవి సమ్మోహనాస్త్రాలుగా సామాజిక మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.