ప్రస్తుతం భారత క్రికెట్ టీంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యాన్ ఎవరంటే ..ఎవరైనా ఠక్కున చెప్పే పేరు ఒకటే అతడే విరాట్ కోహ్లీ.. టీమిండియాలో అంత్యంత ఫిట్ నెస్ కలిగిన వ్యక్తి ఎవరని అడిగినా వెంటనే వినబడే పేరు విరాట్ కోహ్లీ. విరాట్ నిరంతర సక్సెస్ కు అతని ఫిట్ నెస్ కు ఏంటి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? ... ఈ ప్రశ్న విరాట్ కోహ్లీని అడిగితే అతను ఏమన్నాడంటే.. ఫిటెనెసే తన సక్సెస్ సీక్రెట్ అంటూ రెండిటిని జోడించి మాట్లాడుతున్నాడు. విండిస్ పర్యటన కోసం ఫిట్ గా ఉండేందుకు తాను ఎక్సర్ సైజు చేస్తున్న వీడియోను విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వ్యాయామంలో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోను కోహ్లీ సరదాగా తన అభిమానులతో పంచుకున్నాడు. దానికి ‘కష్టపడటానికి మరో ప్రత్యామ్నాయం లేదు’ అని ట్యాగ్ ను జతచేశాడు. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు..