ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త‌న సినిమాకు త‌నే టిక్కెట్లు అమ్మిన హీరో సందీప్ కిషన్ !

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2019, 09:47 PM



ఓ సినిమా హీరో థియేటర్‌లో టికెట్లు అమ్మడం ఎక్కడైనా చూశామా.. లేదుకదూ. కానీ, మన యువ హీరో సందీప్ కిషన్ థియేటర్‌లో టికెట్లు అమ్మి ఓ కొత్త ఒరవడికి తెరలేపాడు. ఈ ఒక్క పనే చేయలేదు సందీప్.. ఊరూరా తిరుగుతున్నాడు. అడిగినవాళ్లకల్లా కాదనకుండా సెల్ఫీలు ఇస్తున్నాడు. ఎవరు పలకరించినా నవ్వుతూ వాళ్లకు జవాబు ఇస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడనే అనుమానం రావచ్చు. సందీప్ నటించిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమా ఇటీవల విడుదల అయింది కదా.. దాని ప్రమోషన్‌లో భాగంగానే సందీప్ ఇదంతా చేస్తున్నాడు.  యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడానికి సందీప్ రకరకాల ఫీట్లు చేస్తున్నాడు.  కాలేజీలకు వెళ్లి కుర్రాళ్లను కలుసి తన సినిమా చూడమని వాళ్లకు చెబుతున్నాడు. గుళ్ళూ గోపురాలు తిరుగుతున్నాడు.  రోడ్ల మీద సైకిల్ తొక్కుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. చివరికి ఈరోజు కాకినాడలోని ఒక థియేటర్లో కౌంటర్లో కూర్చుని టికెట్లు అమ్మి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాడు. సందీప్ పాట్లు ఫలించి సినిమా కలెక్షన్లకు కలిసివస్తుందో లేదో చూడాలి. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com