ఈ నెల 23న వైకుంఠపాళి

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 22, 2019, 09:11 PM

అజ్గర్‌ అలీ దర్శకుడుగా కాండ్రేగుల ఆది నారాయణ నిర్మాతగా సాయికేతన్‌, మేరి, నీలమ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వైకుంఠపాళి. హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాత కె.ఎస్‌. రామారావు పాటల సీడీని ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ హారర్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఓ ప్రమాదకరమైన ఆటలా, అనుక్షణం ఉత్కంఠ కలిగించేలా స్క్రీన్‌ప్లే సాగుతుందన్నారు. ఈ నెల 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో సముద్ర, వీర శంకర్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. సంగీతం : ప్రమోద్‌.
Recent Post

సైరాలో అనుష్క.. !! సైరాలో అనుష్క.. !!

Sat, Aug 24, 2019, 05:20 PM