మూడు రోజుల్లోనే రూ.54.75 కోట్లు

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 22, 2019, 10:04 PM

హాలీవుడ్ మూవీ ద ల‌య‌న్ కింగ్‌ భారత్ లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. బాక్సాఫీసు వ‌ద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.54.75 కోట్లు ఆర్జించింది. 1994లో వ‌చ్చిన ద ల‌య‌న్ కింగ్ సినిమానే కంప్యూట‌ర్ యానిమేష‌న్ టెక్నాల‌జీతో రూపొందించి రిలీజ్ చేశారు. సినిమాలోని సింబా, ముఫాసా క్యారెక్టర్లు ప్రపంచ‌వ్యాప్తంగా ప్రేక్షకుల‌ను అల‌రిస్తున్నాయి. ఇండియాలో మొత్తం 2,140 స్క్రీన్లలో సినిమాను విడుద‌ల చేశారు. ఇంగ్లీష్, హిందీ, త‌మిళం, తెలుగు భాషాల్లో సినిమా రిలీజైంది. మొద‌టి రోజు ఈ సినిమాకు రూ.13.17 కోట్లు వ‌చ్చాయి. భార‌త్‌లో అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్‌, అవెంజ‌ర్స్ ఇన్ఫినిటీ వార్ త‌ర్వాత అత్యధిక వ‌సూళ్లు చేసిన హాలీవుడ్ సినిమాగా ద ల‌య‌న్ కింగ్ నిలిచింది.  
Recent Post

సైరాలో అనుష్క.. !! సైరాలో అనుష్క.. !!

Sat, Aug 24, 2019, 05:20 PM