ఆడబిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 03:53 PM

సింగర్ గీతా మాధురి ఇంట్లో చిన్నారి సందడి మొదలైంది. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈనెల 9న గీతా మాధురి, నందులకు ఆడబిడ్డ పుట్టింది. ఈ విషయాన్ని ఆమె భర్త నందు తన ఇన్‌స్ట్రాగ్రాంలో షేర్ చేశారు. వారితో కలిసి దిగిన ఓ ఫొటోతో పాటు అందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు. అభిమానుల అంతా ఈ జంటకు విషెష్ చెబుతన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో గీతా మధురి తన గాత్రంతో అందరిని అలరించారు. చిన్న హీరోల నుంచి అగ్రహీరోల వరకు అందరి సినిమాల్లో ఆమె పాటలు పాడారు. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మంచి పేరు సంపాధించారు. 2014లో నటుడు నందును పెళ్లి చేసుకున్నారు. తమ ఇంటికి ఆడబిడ్డ రావడంతో సంతోషంలో మునిగితేలుతున్నారు ఈ యువ జంట.
Recent Post