అదిరిపోయే టాక్ తో మిష‌న్ మంగ‌ళ్

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 06:16 PM


ఇండిపెండెన్స్ డే కానుక‌గా విడుద‌లైన మిష‌న్ మంగ‌ళ్ అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. ఇందులో అక్షయ్ కుమార్ తో పాటు విద్యాబాల‌న్, తాప్సి ప‌న్ను, సోనాక్షి సిన్హా, నిత్యా మీన‌న్, కృతి కుల్హ‌రి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. తొలి రోజు ఈమూవీ ఎవరు ఊహించని విధంగా ఏకంగా రూ.29.5 కోట్లు కొల్ల‌గొట్టేసిందీ సినిమా. దీనితో పాటు మరో సినిమా బాట్లా హౌస్ రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమాకే ఎక్కువ క్రేజ్ ఏర్పడింది.


అక్షయ్ కుమార్ కెరీర్‌లో తొలి రోజు ఇది హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఇందులో ఐదుగురు మ‌హిళా శాస్త్ర‌వేత్త‌లు క‌లిసి అసాధ్యం అనుకున్న‌ అంత‌రిక్ష ప్ర‌యోగాన్ని ఎలా సాధ్యం చేసి చూపించార‌నే క‌థ‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. పైగా ఈమూవీకి ప్రమోషన్స్ కూడా బాగా చేసారు. లాంగ్ వీకెండ్ ముగిసేలోపు ఈసినిమా 100 కోట్లు గ్రాస్ వసూళ్లు చేస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.


Recent Post