ఇండస్ట్రీలో వారసత్వంపై ఉత్తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 10:10 PM

సీనియర్ నటుడు ఉత్తేజ్ శివ (1989) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి అదే సినిమాలో చిన్న పాత్ర పోషించి తనలో మంచీ నటుడు కూడా ఉన్నడని మెప్పించాడు ఉత్తజ్.. ఇక ఆ తరువాత సినీ రంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, తనే సొంతంగా ఓ నట శిక్షణ సంస్థను కూడా స్థాపించి ఔత్సాహిక నటీనటులకు నటనలో యువతీయువకులకు మెళకువలు నేర్పిస్తున్నాడు. కాగా, తాజాగా సినీ ఇండస్ట్రీలో వారసత్వంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా కాలంగా చూస్తున్నామని.. టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున కాలం నుండి చూస్తూనే ఉన్నామని.. అయితే నటవారసులకు ఒకట్రెండు అవకాశలు మాత్రమే ఉంటాయని అన్నారు. అయితే అప్పటికి నిరూపించుకోకపోతే ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ప్రవేశించిన మెగా హీరో రామ్ చరణ్ ఎంతో ప్రొఫెషనల్‌గా నటుడని, తండ్రి నుండి వచ్చిన క్వాలిటీ అన్నారు. ఇక అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు తనను తాను ఉలి వేసి మరి చెక్కుకున్నాడని బన్నిని ప్రశంసించారు. ఇకపోతే రవితేజ రియలిస్టిక్‌గా నటిస్తాడని అన్నారు. చివరగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెబుతూ.. అతడిలో యాక్టర్ కనిపిస్తాడని అన్నారు. స్టార్ డంతో పాటు వృత్తినిబద్దత ఉన్న యాక్టర్ తనలో ఉంటాడని.. సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ వచ్చి ఆయన ఉండిపోయిందేమో అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.


 
Recent Post