ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజమైన గ్యాంగ్ లీడర్ మీరు : నాని

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 22, 2019, 02:51 PM



తెలుగు ప్రేక్షకులను తన నటనతో, డ్యాన్స్‌తో ఉర్రూతలూగించి మెగాస్టార్‌గా పదిలమైన స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. ఈరోజు (గురువారం) మెగాస్టార్‌ చిరంజీవి తన 64వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సామన్యులతోపాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా చిరంజీవికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.


నేచురల్ స్టార్ నాని కూడా మెగాస్టార్‌కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. `గ్యాంగ్ లీడర్` పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నాని నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి జన్మదినోత్సం సందర్భంగా `గ్యాంగ్ లీడర్` బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ఫోటోను నాని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. `మా సినిమాలోని ఈ షాట్.. క్లాసిక్ గ్యాంగ్ లీడర్‌కు ఓ ట్రిబ్యూట్ లాంటిది. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ఆ షాట్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేస్తున్నాం. హ్యాపీ బర్త్‌డే సర్.. మేమంతా స్ఫూర్తి పొందుతున్న నిజమైన గ్యాంగ్ లీడర్ మీర`ని నాని ట్వీట్ చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com