తప్పులు చేస్తున్న వారికి వార్నింగ్ లు ఇస్తూ హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులను హడలెత్తిస్తున్నారు. ఈరోజు రాత్రి కూడా నాగార్జున ఎవరిని ఉతికి ఆరేస్తాడన్నది వేచిచూడాలి. ఇక ఈ వారం నామినేషన్ విషయానికి వస్తే.. మొత్తం ఏడుగురు ఎలిమినేషన్ కు రెడీగా ఉన్నారు. పునర్నవి - హిమజ - అషురెడ్డి - రాహుల్ - బాబా భాస్కర్ - మహేష్ విట్టాతో పాటు శిక్ష పడిన శివజ్యోతిలలో ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. వీరిలో ఆదివారం ఎవరు వదిలివెళ్లిపోతారన్నది ఆసక్తిగా మారింది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆదివారం బిగ్ బాస్ నుంచి అషురెడ్డి ఎలిమినేట్ అవుతోందని తెలుస్తోంది. ఈ శనివారమే ఈ ఎపిసోడ్ ను స్టార్ మా రూపొందిస్తుంది. సో అక్కడి నుంచి వచ్చిన లీక్స్ తోపాటు సోషల్ మీడియాలో ట్రెండ్స్ ను బట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అషురెడ్డినే అని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వివిధ సంస్థలు పెట్టిన ఓటింగ్ ప్రకారం కూడా అషుకే తక్కువ ఓట్లు వచ్చాయట.. హౌస్ లో పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం.. తనదైన ముద్ర వేయకపోవడంతోనే ఆమెను ప్రేక్షకులు ఎలిమినేట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.