న్యూ లుక్ లో మహారాజా రవితేజ...!

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 24, 2019, 03:26 PM

వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న'డిస్కో రాజా'  చిత్రం షూటింగ్ శరావేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కథ ప్రకారం మాస్ మహారాజా రవితేజ రెండు రకాల షేడ్స్ ఉండే పాత్ర పోషిస్తున్నాడని.. అందులో ఒకటి యువకుడి పాత్ర అని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా బయటకు వచ్చిన ఒక ఫోటోను చూస్తే అది నిజమేననిపించేలా ఉంది.  ఈ ఫోటోలో రవి తేజ మరో వ్యక్తితో కలిసి సెల్ఫీ తీసుకుంటున్నాడు.  మీసాలు.. గడ్డం లేకుండా స్లిమ్ గా గా ఉన్న రవితేజను చూస్తే ఓ పాతికేళ్ళ వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలోకి రాగానే వైరల్ గా మారింది.  ఇది 'డిస్కో రాజా' సినిమా షూట్ లొకేషన్ నుంచి లీక్ అయిన ఫోటో అనే టాక్ వినిపిస్తోంది. రవితేజ ఈమధ్య నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలపడుతున్నాయి. అయితే 'డిస్కో రాజా' కు టాలెంటెడ్ ఫిలిం మేకర్ వీఐ ఆనంద్ దర్శకుడు కావడంతో ఈ సినిమా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. 
Recent Post