రైతు గా మారనున్న శర్వానంద్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 24, 2019, 03:34 PM

శర్వానంద్‌ కథానాయకుడిగా 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై ‘శ్రీకారం’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమాలో ఆయన నాగలి పట్టి వ్యవసాయం చేయబోతున్నారు.  ఈ సినిమా ద్వారా కిషోర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నారు. రైతు సమస్యల నేపథ్యంలో ఎమోషనల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్‌ రైతు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి హైదరాబాద్‌, తిరుపతి, అనంతపూర్‌లలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్లు చెబుతున్నారు. సత్యరాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించనున్నట్లు సమాచారం.
Recent Post