గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్నా ప్రియాంకా చోప్రా. తన విజయంలో తన తండ్రి ఆకాశ్ చోప్రా పాత్ర అతి కీలకమైనది అన్ని తన తండ్రి ఎప్పుడూ గుర్తుండేలా `డాడీస్ లిటిల్ గర్ల్` అని తన చేతిపై ప్రియాంక టాటూ వేయించుకుంది. తన తండ్రి జయంతి సందర్భంగా ప్రియాంక సోషల్ మీడియాలో ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది.
తన తండ్రి ఫోటోను పోస్ట్ చేసి బ్యాగ్రౌండ్లో ఆయనకిష్టమైన పాటను జత చేసింది. `మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని మీ ప్రతీ పుట్టినరోజునాడు నేను, సిద్ధార్థ్ కలిసి ప్లాన్ చేసేవాళ్లం. కానీ, మా ప్లాన్లన్నీ మీకు ముందుగానే తెలిసిపోయేవి. నేను చేసే ప్రతీ పనిలోనూ మీ అంగీకారం, ప్రోత్సాహం తప్పనిసరి. ఇప్పటికీ మీ ఆశీర్వాదాలతోనే నాకు అన్నీ జరుగుతున్నాయి. హ్యాపీ బర్త్‌డే నాన్నా మీరు ప్రతీరోజూ నాతోనే ఉంటే బాగుండుననిపిస్తోంది అని ప్రియాంక పేర్కొంది.