అరుణ్‌ జైట్లీ మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం..

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 24, 2019, 04:11 PM

అరుణ్‌ జైట్లీ మరణవార్త నన్నెంతో బాధించింది. ఆయన ఆదర్శప్రాయమైన పార్లమెంటు సభ్యుడు, గొప్ప నాయకుడు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ -సినీ నటి, ఎంపీ సుమలత


‘జైట్లీ ఓ డైనమిక్‌ లీడర్‌, జెంటిల్‌మెన్‌. ఆయనతో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా’ - ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌


‘20 ఏళ్ల క్రితం అరుణ్‌ జైట్లీని తొలిసారి కలిశా. అప్పటి నుంచి ఆయనకు అభిమానిగా మారిపోయా. ఆయన కన్నుమూత మన దేశానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ - బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్


‘అరుణ్‌ జైట్లీ మృతి నన్ను షాక్‌కు గురి చేసింది. ఓ మంచి మనిషి త్వరగా మనల్ని వదిలి వెళ్లిపోయారు’ - నటి రవీనా టాండన్‌


‘అరుణ్‌ జైట్లీ మృతి నన్నెంతో బాధించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను’ - ప్రముఖ గాయని ఆశా భోంస్లే


‘మరో గొప్ప నాయకుడ్ని దేశం కోల్పోయింది. ఇలాంటి కష్ట సమయంలో ఆయన కుటుంబానికి దేవుడు తట్టుకునే బలాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’ - బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవోల్‌


‘మన దేశం మరో గొప్ప నాయకుడు కోల్పోయింది. మేం మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం’ - నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌


‘మనం మరో గొప్ప  నేతను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయన మృతి దేశానికి తీరని లోటు’ - టాలీవుడ్‌ నటి ప్రణీత


 ‘గొప్ప నాయకుడు అరుణ్‌ జైట్లీకి ఇదే మా వీడ్కోలు. మీరు దేశం కోసం చేసిన సేవకు ధన్యవాదాలు’ - టాలీవుడ్‌ నటుడు సుశాంత్‌


‘అరుణ్‌ జైట్లీ మరణ వార్త  నన్నెంతో బాధించింది. భారతదేశ అభివృద్ధి కోసం ముందు చూపుతో వ్యవహరించిన ఆయనకు నేను అభిమానిని. ఆయనలాంటి గొప్ప నాయకుడిని గతంలో కలవడం నా అదృష్టం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ - బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌
Recent Post