సైరాలో అనుష్క.. !!

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 24, 2019, 05:20 PM

బ్రిటిష్‌ ప్రభుత్వంపై  తిరగబడిన తొలి తరం పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ''సైరా' చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ముంబై లో లాంచ్ తర్వాత అక్కడి మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన చిరు చరణ్ లు వాళ్ళతో చాలా విశేషాలే పంచుకున్నారు. వాటి తాలూకు వీడియోలు ఆన్ లైన్ లో రచ్చ చేస్తున్నాయి. అందులోనే అనుష్క ఈ సినిమాలో ఉంటుందన్న సీక్రెట్ ని చిరు స్వయంగా చెప్పేయడంతో సస్పెన్స్ కు తెరపడింది. నిజానికి ఈ పాత్రను రహస్యంగా ఉంచి రిలీజ్ రోజు సర్ప్రైజ్ ఇవ్వాలని కొణిదెల టీమ్ అనుకున్నట్టుగా గతంలోనే న్యూస్ వచ్చింది. అయితే నిజంగా ఉందా లేదా అనే నిర్ధారణ లేక మీడియా సైతం పుకారుగానే భావించింది.  ఇప్పుడు హీరోనే చెప్పడంతో ఇంకెలాంటి అనుమానం అక్కర్లేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పరిచయం ఝాన్సీ లక్ష్మి బాయ్ ద్వారా జరుగుతుందని ఆ రోల్ అనుష్క అద్భుతంగా పోషించిందని చిరంజీవి చెప్పడం విశేషం. ఇప్పటికే అమితాబ్- సుదీప్- విజయ్ సేతుపతి- నయనతార- తమన్నాల కాంబోతో అవుట్ అండ్ అవుట్ రిచ్ మల్టీ స్టారర్ గా మారిన సైరాలో ఇప్పుడు అనుష్క ఉన్నది కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి మరో అదనపు ఆకర్షణ తోడయ్యింది. 
Recent Post