తూనీగ ఫస్ట్‌ లుక్‌ విడుదల

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 24, 2019, 07:29 PM

అతి త్వరలో విడుదల కానున్న తూనీగ ఫస్ట్‌ లుక్‌ను ప్రముఖ దర్శకులు సతీశ్‌ వేగేశ్న సామాజిక మాధ్యమం ఫేస్‌ బుక్‌ ద్వారా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంతా కొత్తవారే కలిసి సమిష్టి కృషితో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, దర్శకులు ప్రేమ్‌ సుప్రీమ్‌ మరిన్ని మంచి చిత్రాల రూపకర్తగా పేరు తెచ్చుకోవాలని కోరుతూ.. అక్షరాభినందన అందించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం గొప్ప పల్లె సంస్కృతికి ఆనవాలు అని, ఈ చిత్ర ప్రచార సారథి, వర్ధమాన రచయిత రత్నకిశోర్‌ శంభుమహంతితో ఆత్మీయ అనుబంధం ఉందని అన్నారు.


 
Recent Post