ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైరా మూవీలో నయన్ షాకింగ్ రెమ్యూనరేషన్ ? 

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2019, 01:49 PM



సురేందర్ రెడ్డి దర్శకత్వం,  రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది ‘సైరా నరసింహారెడ్డి’..     ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఈ మూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తోన్న 'సైరా'లో.. మెగాస్టార్‌కు జోడీగా నయనతార నటిస్తోంది. ఇక, ఈ మూవీ కోసం నయన్ షాకింగ్ రెమ్యునరేషన్ అందుకున్నట్టు టాక్.. ఏకంగా నయనతారకు రూ.6 కోట్లు పారితోషకాన్ని మేకర్స్ ఇచ్చనట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చసాగుతోంది. సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లో నటించిన నయన్‌కు మంచి క్రేజ్ ఉండడంతో.. బెట్టు చేయకుండా అడిగినంతా అప్పజెప్పారట. ఇక, ఏ సినిమాలో నటించినా.. నయన్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండే సంగతి తెలిసిందే.. ఇంత భారీ మొత్తం అందుకున్న అమ్మడు ఈ సినిమా ప్రమోషన్‌లోనైనా పాల్గొంటుందేమో చూడాలి మరి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com