గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై మంచి సక్సెస్ ను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది `హుషారు`. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీహర్ష తో విజయ దేవరకొండ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది విడుదలైన `డియర్ కామ్రేడ్`తో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయారు హీరో విజయ్‌దేవరకొండ. ఇప్పుడు ఈ హీరో క్రాంతి మాధవ్ దర్శకత్వంలోఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారీయన. అయితే పూరి, విజయ్‌ల సినిమా వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోపు విజయ్ దేవరకొండ మరో సినిమా చేయడానికి రెఢీ అయ్యారని టాక్. సినీ వర్గాల సమాచారం మేరకు విజయ్ దేవరకొండ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారట. ఈ యువ దర్శకుడు రీసెంట్గా విజయ్‌ని కలిసి ఓ లైన్ చెప్పారట. ఆ లైన్ తనకు నచ్చడంతో సినిమా చేయడానికి ఓకే అన్నారని టాక్. త్వరలోనే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. మరి `హుషారు` డైరెక్టర్ విజయ్ దేవరకొండలో సక్సెస్‌ను హుషారుని నింపుతాడో లేదో చూడాల్సిందే.