ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళ ఫిలిం డైరెక్టర్ రాజశేఖర్ కన్నుమూత 

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2019, 06:15 PM



ప్రముఖ తమిళ ఫిల్మ్ డైరక్టర్,నటుడు రాజశేఖర్(62) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(సెప్టెంబర్-8,2019)తుదిశ్వాస విడిచారు. రాజశేఖర్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.  ఓ నటుడిగా భారతీరాజా దర్శకత్వం వహించిన నిజాల్గల్ (1980) సినిమాతో రాజశేఖర్ తెరంగేట్రం చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో కన్నుమూసిన రాబర్ట్‌ ఆశీర్వాథమ్ తో కలిసి రాజశేఖర్ తమిళ చిత్ర పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించాడు. ఒరు తలై రాగం, పలైవనచొలై, చిన్నపూవ్ వంటి హిట్ సినిమాల్లో కలిసి పనిచేశారు. డైరెక్టర్ గా కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఆయన పలైవనచొలై,చిన్నపూవే మెళ్ల పెసు వంటి సూపర్ హిట్ సినిమాలను డెరెక్ట్ చేశారు. అంతేకాకుండా రాజశేఖర్ చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థి కూడా.     






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com