బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో సెల్ఫీలే దిగే అవకాశం వస్తే ఎవరు వద్దనుకుంటారు. అలంటి సంఘటనే ముంబైలో చోటుచేసుకుంది. వర్షాల కారణంగా సల్లు భాయ్ సైకిల్ పై షూటింగ్ కి బయలుదేరారు. సల్మాన్ వంటి సూపర్‌స్టార్ రోడ్డుపై కనిపిస్తే అభిమానులు ఊరుకోరు కదా.. వెంటనే ఒక్క సెల్ఫీ భాయ్ అని అడిగారు. స్మైల్‌తో సల్మాన్ పోజిచ్చారు. ఇలా చాలా మంది సెల్ఫీస్‌లో బందీ అయిపోయారు సల్మాన్. ఇక ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘దబాంగ్ 3’ సినిమాలో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.