ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"వాల్మీకి"లో వరుణ్ తేజ్ పేరు 'గద్దలకొండ గణేశ్'

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2019, 01:03 PM



హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరో గా నటిస్తున్న చిత్రం "వాల్మీకి". అయితే ఈ సినిమా సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో వరుణ్ గన్ పట్టుకొని నల్ల కళ్ళజోడుతో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో తేజ్ పేరు ఏమైఉంటుందని ఉత్సుకతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో తన పేరు 'గద్దలకొండ గణేశ్' అని చెప్పేశారు. ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాడు. ఈ నెల 20వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా పూజా హెగ్డే, మరో కథానాయికగా మృణాళిని రవి నటించారు. తమిళ హీరో అధర్వ మురళి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనుండటం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com