వెన్నెల కిషోర్ పేరు చెప్పగానే మనకు తెలియకుండానే పెదవిపై చిరునవ్వు వస్తుంది. ఎందుకంటె ఆయన చేసే కామెడీ, వేసే పంచ్ లే కారణం. వెండితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ తనదైన శైలి హాస్యంతో నవ్వులు పూయిస్తుంటాడు కమెడియన్ వెన్నెల కిషోర్. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న `డిస్కోరాజా` షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా సెట్స్‌లో రవితేజతో దిగిన ఫోటోను కిషోర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. `క్యూరియస్తో ఫ్యూరియస్.. డిస్కోరాజా.. ఎందుకంత కోపం` అని ట్వీట్ చేశాడు.