ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగ్ చేతిపై నాగుపాముతో కూడిన టాటూ

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2019, 01:34 PM



టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం రియాలిటీ షో బిగ్‌బాస్3 కి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో అతిథిగా నేచుర‌ల్ స్టార్ నాని పాల్గొన్నారు. నాగార్జున చేతిపై ఓ కొత్త టాటూ వేయించుకున్నార‌ని దాన్ని ఎవ‌రికీ క‌నిపిచంకుండా దాచి పెడుతున్నార‌ని అన్నారు. ఇక హౌస్‌మేట్స్ అడ‌గ‌టంతో నాగార్జున త‌న ఎడ‌మ చేతిపై ఉన్న దిక్చూచి, నాగుపాము కాంబినేష‌న్‌లో ఉన్న టాటూని చూపిస్తూ దానికి వివ‌ర‌ణ ఇచ్చారు. ``నాగుపాముని చూస్తుంటే అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది. ఇక కంపాస్‌(దిక్చూచి)లో క‌న్ను నాదే. అంటే నేను ఎప్పుడూ కొత్త విష‌యాల‌ను వెతుకుతుంటానని అర్థం. అలాగే దిక్చూచిలోని క‌న‌ప‌డుతున్న అక్ష‌రం `ఎన్‌` ఉత్త‌ర దిక్కు లేదా నా పేరు(నాగార్జున‌)ని సూచిస్తుంది. ఇక టాటూలోని పాము ద‌గ్గ‌రున్న చుక్క‌లకు అర్థం నాగుపాము కుబుసంను విడిచిపెట్టిన‌ట్టు తాను కూడా గ‌తాన్ని మ‌ర‌చిపోయి కొత్త విష‌యాల‌ను అన్వేషిస్తుంటాను`` అని అర్థ‌మంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com