ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న నాని

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2019, 02:15 PM



టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ చిత్రంతో మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విలక్షణ కథా చిత్రంలో నాని మునుపెన్నడూ పోషించని సరికొత్త పాత్రలో నటించాడు. గ్యాంగ్ లీడర్ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో నాని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. నానీకి ఆలయ వర్గాలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి. దర్శనం అనంతరం నానీకి ఆలయ అధికార వర్గాలు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించాయి. ఈ సందర్భంగా నాని దశాంజనేయ ఆలయాన్ని కూడా సందర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com