రకుల్ ప్రీత్‌సింగ్ ఓ రీమిక్స్ సాంగులో స్టెప్పులేశారు. అదీ 30 ఏళ్ల క్రితం రమ్యకృష్ణ స్టెప్పులేసిన స్పెషల్ సాంగ్ రీమిక్సులో. అయితే అది తెలుగు పాట కాదు, హిందీ పాట. ఫిరోజ్ ఖాన్, వినోద్ ఖన్నా నటించిన చిత్రం దయావాన్ (1988). ఇందులో చాహి మేరే జాన్ తు లే లే అని స్పెషల్ సాంగులో రమ్యకృష్ణ స్టెప్పులేశారు. ఈ పాటను మర్జావాన్ కోసం తాజాగా రీమిక్స్ చేశారు. ఇటీవలే హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్‌పై చిత్రీకరించారట. ఈ సినిమాలో రకుల్ డ్యాన్సర్‌గా కనిపించనున్నారు. ఇదే సినిమాలో మరో రీమిక్స్ పాటలోనూ రకుల్ స్టెప్పులేశారు. ఆదిత్య పంచోలి. అమల జంటగా నటిచిన కబ్ తక్ చుప్ రహూంగీ లో హయ్యా హయ్యా రీమిక్స్.. రకుల్ ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలిసింది. తారా సుతారియా మరో నాయికగా, రితేశ్ దేశ్‌ముఖ్ మరుగుజ్జుగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 8న విడుదల కానుంది.