ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాల్మీకి' ప్రతి ఒక్కరికి నచ్చుతుంది : హరీష్   

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2019, 10:34 PM



మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా రీమేక్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, మరియు రెండు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ అందుకు న్నాయి.  తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ అనే సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఫస్ట్ టైం గని అలియాస్ గద్దలకొండ గణేష్ అనే ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో నటిస్తున్నారు.  తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది . ఈ సినిమాలో వరుణ్ పక్కా మాస్ లుక్ తో తెలంగాణా భాషలో కనిపిస్తున్నాడు. హరీష్ డైలాగ్స్ కూడా బాగా పేలా యనే చెప్పాలి . ఇక సినిమా ప్రెస్ మీట్ లో దర్శకుడు హరీష్ మాట్లాడుతూ వరుణ్ సినిమాలో బాగా యాక్ట్ చేసాడని చెప్పుకొచ్చాడు . సినిమాలో ఎక్కువగా మార్పులు చేయలేదని, కానీ చేసిన కొన్ని మార్పులు మాత్రం చాలా ఆకట్టుకుంటాయని హరీష్ చెప్పాడు . మొత్తానికి 'వాల్మీకి' ప్రతి ఒక్కరికి నచ్చుతుందని, అభిమానులు గర్వపడేలా ఉంటుందని హరీష్ చెప్పాడు . ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com