విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు రూపొందించిన ఓ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్లో సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు క్రేజీ కాంబినేషన్స్‌ను సెట్ చేస్తున్నాడు. ఒకవైపు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ల చిత్రాలను నిర్మిస్తూనే మరో వైపు రాజ్ తరుణ్ లాంటి హీరోలతో చిన్న సినిమాలను రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ నిర్మాత రవిబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు తెరకెక్కిస్తున్న రవిబాబు భారీ కమర్షియల్ సక్సెస్‌లు మాత్రం సాధించలేకపోతున్నారు. తాజాగా అంతా కొత్తవారితో ‘ఆవిరి’ అనే టైటిల్‌తో ఓ సినిమాను రూపొందించాడు రవిబాబు. ఈసినిమాను దిల్ రాజు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.