ట్రెండింగ్
Epaper    English    தமிழ்

`బ‌దాయి హో` రీమేక్ లో నాగ చైత‌న్య‌..?

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2019, 04:05 PM



`మ‌జిలీ` చిత్రం సూపర్ హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న యంగ్ హీరో నాగ చైత‌న్య‌ ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో సాయిప‌ల్ల‌వితో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇది పూర్తి కాగానే అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో చైత‌న్య మ‌రో సినిమా చేసే అవ‌శాలున్నాయి. దీనికి సంబంధించిన తుది ద‌శ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే త్వ‌ర‌లోనే చైత‌న్య ఓ బాలీవుడ్ చిత్రంలో న‌టించ‌బోతున్నార‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. స‌మాచారం మేర నిర్మాత దిల్‌రాజు బాలీవుడ్ చిత్రం `బ‌దాయి హో` సినిమా తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నార‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. దిల్‌రాజు, బోనీక‌పూర్‌లు ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించ‌నున్నార‌ట‌. ఈ చిత్రంలో చైత‌న్య న‌టించ‌డానికి ఓకే చెప్పార‌ని సోష‌ల్‌మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com