ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘RDX లవ్’ ట్రైలర్..రొమాన్సే కాదు యాక్ష‌న్ కూడా

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2019, 04:26 PM



RX 100 మూవీ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రం ‘RDX లవ్’. హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శంక‌ర్‌భాను ద‌ర్శ‌కుడు. సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌లో రొమాన్స్ చూసి.. ప్ర‌స్తుతం సినిమాల్లో పెరుగుతున్న రొమా్న్స్‌కి టీజ‌ర్ పీక్స్‌గా ఉంద‌ని అనుకున్నారు. ట్రైల‌ర్ ఎలా ఉంటుందోన‌ని భావించారు. అయితే మంగ‌ళ‌వారం విడుద‌లైన ట్రైల‌ర్ సినిమా అస‌లు కంటెంట్ ఏంటో చూపించింది. టీజ‌ర్‌లో ఫుల్ రొమాన్స్ ఉంటే.. ట్రైల‌ర్ అదిరిపోయే యాక్ష‌న్ పార్ట్‌.. డైలాగ్స్ ఉన్నాయి. తేజ‌స్ కంచ‌ర్ల‌, పాయ‌ల్‌ల‌తో పాటు వి.కె.న‌రేశ్‌, నాగినీడు, ఆదిత్య‌మీన‌న్ పాత్ర‌లు ట్రైల‌ర్‌లో క‌న‌ప‌డ్డాయి. అలాగే కొన్ని స‌న్నివేశాల్లో పాయ‌ల్ రాజ్‌పుత్ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ అని రివీల్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com