ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క 'నిశ్శబ్దం' ప్రీ లుక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2019, 04:43 PM



చాలా గ్యాప్ తరువాత అనుష్క నటిస్తున్న కొత్త చిత్రం 'నిశ్శబ్దం'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఒక పెయింటింగ్ వేస్తున్న చేతిని చూపిస్తూ ఆ బొమ్మని రివీల్ చేయకుండా ఇదేదో మిస్టరీ థ్రిల్లర్ అనే ఫీలింగ్ వచ్చేలా దీన్ని డిజైన్ చేశారు. ఒక కోణంలో చూస్తే అనుష్కనో లేదా మాధవనో పెయింటర్ ఉండే ఛాన్స్ ఉంది. మరి నిశబ్దం అనే టైటిల్ కి ఈ అందమైన పెయింటింగ్స్ కి కనెక్షన్ ఏముందో టీజర్ వచ్చాక కొంత క్లారిటీ రావొచ్చు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న నిశబ్దంకు గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇటీవలి కాలంలో ఈ ప్రీ లుక్స్ ట్రెండ్ ఎక్కువయ్యింది. పబ్లిక్ తో మీడియా వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా సదరు సినిమా యూనిట్స్ మాత్రం ఒకటి రెండు రోజులు ముందు వీటిని వదులుతూ హైప్ ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. చేతులో లేక బ్యాక్ షాట్ నుంచి కనిపించకుండా హీరో హీరొయినో ఇలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగూ ఒకే రోజు గ్యాప్ ఉన్నప్పుడు నేరుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే సరిపోతుంది కాని ఇలా ప్రతి చిన్నా పెద్ద సినిమాకు చేతులు కాళ్ళు రిలీజ్ చేసే పబ్లిసిటీ మర్మమేమిటో మరి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com