ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్‌-శ్రీముఖి ఫాలోవర్స్‌ వార్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2019, 08:04 PM



బిగ్‌బాస్‌ హౌస్‌లో రాహుల్‌-శ్రీముఖిల మధ్య మొదటి వారం నుంచి మొదలైన ఈ వైరం ఎన్నటికి ముగుస్తుందో అన్నది ప్రశ్నార్థకం. బయట ఉన్న శ్రీముఖికి బిగ్‌బాస్‌లో ఉన్న శ్రీముఖికి చాలా తేడా ఉందని.. బయట తనకు క్లోజ్‌ ఫ్రెండ్‌ అని రాహుల్‌ చెబుతూ ఉంటాడు. ఇక రాహుల్‌ చేసే పనులు, మాట్లాడే మాటలు తనకు నచ్చవని శ్రీముఖి ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. తనను అసభ్యకరంగా దూషించాడని, తన వృత్తిని అవమానించాడని రాహుల్‌పై కోపం పెంచుకుంది. వీరిమధ్య క్షమాపణల పర్వం జరుగుతూనే ఉన్నా.. దూరం మాత్రం తగ్గడం లేదు. 


బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నంతకాలం నామినేట్‌ చేస్తానని ప్రతిజ్ఞ చేసిన శ్రీముఖి.. ఈవారం షాక్‌ ఇచ్చింది. అందరూ రాహుల్‌ను నామినేట్‌ చేస్తానని అనుకుంటారు కానీ.. ఈ వారం చేయట్లేదు అంటూ షాక్‌ ఇచ్చింది. అయితే రాహుల్‌ మాత్రం శ్రీముఖినే నామినేట్‌ చేశాడు. అయితే ఇదే విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. నామినేషన్‌లో ఉన్న ప్రతీసారి రాహుల్‌ సేవ్‌ అవుతూనే వస్తున్నాడని.. అతనికి ఫాలోయింగ్‌ పెరిగిందని.. అందుకే భయపడి నామినేట్‌ చేయలేదని రాహుల్‌ అభిమానులు  కామెంట్లు చేస్తున్నారు. అయితే వీటికి ప్రతిస్పందనగా.. శ్రీముఖి ఫాలోవర్స్‌ కూడా కౌంటర్లు వేస్తున్నారు. నామినేట్‌ చేస్తే టార్గెట్‌ చేసిందంటారు.. చేయకపోతే భయపడిందని అంటారని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. రాహుల్‌కు రోజురోజుకూ ఫాలోయింగ్‌ పెరుగుతుందనేది మాత్రం నిజం. తన నోటి దురుసును కాస్త తగ్గించుకుని, టాస్క్‌లో ఇంకా యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేస్తే తనకు ఎదురులేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కు వీరద్దరి మధ్య జరిగే వార్‌ హైలెట్‌గా నిలవనుంది. వీరిద్దరిలో చివరి వరకు ఎవరు నిలబడుతారో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com