బిగ్ బాస్ ఇంటి నుంచి మహేష్‌ ఎలిమినేట్‌ ..?

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 13, 2019, 06:49 PM

మహేష్‌ను బిగ్‌బాస్‌ ఎలిమినేట్‌ చేశాడు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులందరూ నమ్మేలా మహేష్‌ సీక్రెట్‌ టాస్క్‌ చేయాలి. అసలే ఈ వారంలో నామినేషన్‌లో ఉన్న మహేష్‌కు ఈ సీక్రెట్‌ టాస్క్‌ ఏమైనా ఉపయోగపడుతుందా? లేదా అన్నది తెలియాలి. గతవారంలో ఎలిమినేషన్‌ జోన్‌లో శ్రీముఖి మినహా మిగతా అందరూ మగవారే. అయితే ఈ సారి దానికి భిన్నంగా ఉంది. ఈ వారంలో నామినేషన్‌లో ఉన్నది మహేష్‌ మినహా అందరూ ఆడవారే. మరి ఈ వారంలో మహేష్‌ను సేవ్‌చేసేందుకే బిగ్‌బాస్‌ ఈ సీక్రెట్‌ టాస్క్‌ను ఇచ్చాడా? తెలియదు.  తాను ఎలిమినేట్‌ అయినట్లు, ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిందిగా బిగ్‌బాస్‌ ఆదేశించినట్లు మిగతా ఇంటి సభ్యులను మహేష్‌ నమ్మించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా తన లగెజ్‌ను సర్దుకుంటూ ఉన్నాడు. మధ్యలో బాబా భాస్కర్‌ అడుగుతుండగా.. దానికి మహేష్‌ ఏదో ఆన్సర్‌ చెబుతున్నాడు. సీరియస్‌గా నటిస్తూ... ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాడు.. మరి నిజంగానే ఈ సీక్రెట్‌ టాస్క్‌లో గెలిస్తే.. ఈ వారం మహేష్‌ సేవ్‌ అయినట్టేనా? మహేష్‌ ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకుంటాడా? అన్నది తెలియాలంటే ఎపిసోడ్‌ ప్రసారమయ్యేవరకు ఆగాలి.
Recent Post