షూటింగ్ పూర్తిచేసుకున్న దీపికా

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 14, 2019, 01:25 PM

బాలీవుడ్ నటి దీపికపదుకొణె షూటింగ్ పూర్తయిందట. లెజెండరీ ఇండియా క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా కబీర్ ఖాన్ 83 అనే సినిమా తెరకెక్కుతుంది. రణ్‌వీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ నటి దీపికాపదుకొణే  రోమి దేవ్ అనే పాత్రలో నటిస్తుంది. రియల్‌లైఫ్ మాదిరిగానే రీల్‌లైఫ్‌లోను రణ్‌వీర్‌సింగ్ భార్యగా దీపికా  కనిపించనుంది.ఈ  చిత్రంలో దీపికా పాత్ర నిడివి కేవలం 10 నుంచి 12 నిమిషాలు మాత్రమే ఉంటుందట.  తాజాగా ఆమె పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్తయిందని సమాచారం. ప్ర‌స్తుతం ముంబైలో ఈ  చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. పెళ్ళి త‌ర్వాత తొలిసారి ఈ జంట 83 అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో క్రికెటర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో త‌మిళ న‌టుడు జీవా న‌టిస్తున్నాడు. నవాజుద్దీన్ సిద్దిఖీ ..రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు. 2020 ఏప్రిల్ 10న‌ గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రంని విడుద‌ల చేయ‌నున్నారు. మ‌ధు మంతెన‌, విష్ణు ఇందూరి, ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంక‌జ్ త్రిపాఠి, తాహిర్ ఆజ్ భాసిన్‌, స‌కీబ్ స‌లీమ్, చిరాగ్ ప‌టిల్‌, అదినాథ్ కొఠారే, ధైర్య క‌ర్వా, దిన‌క‌ర్ శ‌ర్మ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.


 


 
Recent Post