కొత్త దర్శకుడితో నాగార్జున...?

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 14, 2019, 03:35 PM

కింగ్ నాగార్జున ప్రస్తుతం బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా బిజీగా బిజీగా ఉన్నారు. ‘మన్మథుడు 2’ తర్వాత నాగార్జున మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇంకా ఇవ్వలేదు. కల్యాణ్ కష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమాలో నాగ్ నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో చైతన్య కూడా నటించాల్సి ఉంది. ప్రస్తుతం చైతన్య ఇతర కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నాడు. కాబట్ట ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లడానికి సమయం పడుతుంది. ఈలోపు నాగార్జున మరో సినిమాను చేసేయాలనుకుంటున్నారని సినీ వర్గాల టాక్. స్క్రిప్ట్ రైటర్ సోల్‌మన్ చెప్పిన కథ నాగ్‌కు నచ్చిందట. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించే దిశగా చర్చలు జరుగుతున్నాయట అన్ని అనుకున్నట్లు కుదిరితే సోల్‌‌మన్‌ దర్శకత్వంలో నాగార్జున సినిమా తెరకెక్కుతుంది.
Recent Post