`చిన్నా తో ప్రేమగా` ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 14, 2019, 10:26 PM

పీవీఆర్ దర్శకత్వం లో ఎస్.యన్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా `చిన్నా తో ప్రేమగా` అనే చిత్రాన్ని బి. చండ్రాయుడు నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం లో ఎస్ ఎన్ చిన్నా , హేమంత్  , శ్రద్ధ , చైత్ర, నందిని హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 


 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న‌ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ...``ఒక మంచి కథ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్ తో పాటు మూడు పాటలకు కోరియోగ్రఫీ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ఈ వారం చివరికల్లా కంప్లీట్ అవుతుంది. మరో మూడు షెడ్యూల్స్ లో సినిమా పూర్తి చేస్తాం`` అన్నారు . దర్శకుడు పీవీఆర్ మాట్లాడుతూ.. ``లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. చిట్టి బాబు కామెడీ , ప్రియాంక క్లాసికల్ డాన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ `` అన్నారు. 


శివ శంకర్ మాస్టర్ మాట్లాడుతూ... ``ఇందులో ఒక మంచి క్యారెక్టర్ తో పాటు మూడు పాటలకు కొరియోగ్రఫీ చేసున్నాను. ఫస్ట్ షెడ్యూల్ చాలా బాగా జరుగుతోంది. దర్శక నిర్మాతలు రాజీ పడకుండా  చిత్రీకరిస్తున్నారు ` అన్నారు.  
Recent Post