అఖిల్ అక్కినేని స‌ర‌స‌న‌ పూజా హెగ్డేకి ఛాన్స్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 14, 2019, 10:31 PM

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై   బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో అఖిల్ అక్కినేని హీరోగా నిర్మాత‌లు బ‌న్నీవాసు , వాసు వ‌ర్మ  సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు   హీరోయిన్ గా పూజా హెగ్డే నును ఫైనల్ చేశారు. డి.జె, అరవింద సమేత, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోయిన్ గా అందం, అభినయంతో ఆకట్టుకున్న  హీరోయిన్ గా ఖరారు చేసినట్టు చిత్ర యూనిట్ చెప్పింది. అఖిల్,  పూజా హెగ్డే జోడీకి మంచి పేరు వస్తుందని... దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు  


బొమ్మ‌రిల్లు  ఇప్ప‌టికి ట్రెండ్ సెట్ట‌ర్ ఇన్ ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా నిలిచిపోయిందంటే అది కేవ‌లం ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ విజ‌న్ అండ్ వాల్యూస్ అని చెప్పాలి. ఆ త‌రువాత వ‌చ్చిన ప‌రుగు చిత్రం ప్ర‌తి ఓక్క‌రిని ఆలోచింప‌చేసేలా అద్బుతంగా తీర్చిదిద్దాడు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో భాస్క‌ర్ ది సెప‌రేటు ఇమేజ్ వుంది. ఇప్ప‌డు వీర‌ద్దిరి కాంబినేష‌న్ లో చిత్రం అన‌గానే ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది.
Recent Post