త‌న త‌ల్లిదండ్రుల గురించి అక్కినేని అమ‌ల ఎమోషనల్ పోస్ట్

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 15, 2019, 10:21 PM

సినీ అమల ఒక‌ప్పుడు వెండితెర‌మీద వెలిగిన అందాల భామ‌.  హీరో నాగార్జునతో ప్రేమ వివాహం త‌దుప‌రి అక్కినేని అమ‌ల‌గా మారిన త‌దుప‌రి  పలు సినిమాల్లో అలా... అలా క‌నిపించింది.   జంతు ర‌క్ష‌ణ‌ కోసం బ్లూ క్రాస్ సొసైటీని ఏర్పాటు చేసి, పోరాడుతోన్న వ్యక్తిగా ఇప్పుడు అందరికీ సుపరిచితురాలైంది.


 అక్కినేని ఇంటి కోడలిగానే తెలిసిన అమల ఈ మ‌ధ్య తన తల్లిదండ్రుల గురించి నెట్టిoట్లో సంధిస్తున్న‌ ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎందుకంటే ఆమె త‌ల్లిదండ్రుల విష‌యం పెద్దగా బయట ప్రపంచానికి తెలియజేయలేదనే చెప్పాలి.  దీంతో అమలా స్పందిస్తూ… “నా పేరెంట్స్ గురించి కొన్ని అసత్య కథనాలు వస్తున్నాయి.  అందుకే వివరణ ఇస్తున్నాను.  మా అమ్మగారు ఐరిష్ మహిళ.  మా నాన్నగారు భారతీయుడు,  ఉత్తర ప్రదేశ్ లో పెరిగారు భారతీయ నౌకాదళంలో పని చేశారు. ఆయన పుట్టింది మాత్రం ఈస్ట్ బెంగాల్ లోని ఢాకా. ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ గా మారక ముందు సంగతి ఇది.  మా అమ్మ నిజమైన భారతీయురాలిగా ఉంటుందని  నాగార్జున మా అమ్మ‌ని అత్తగారు అనే సంబోధించావార‌ని  చెప్పింది. మా వ్య‌క్తిగ‌త జీవితాల గుర్తించి, స‌రిగా అర్ధం చేసుకోలేని వారు ఇష్టం వ‌చ్చిన‌ట్టు పోస్టులు పెడుతున్నార‌ని, చ‌రిత్ర‌ అర్థం చేసుకోకపోతే.. వారికి దేశ విభజన వల్ల కలిగిన నష్టం.. బాధ ఎప్పటికీ  తెలియవు.  కమాండర్ MK ముఖర్జీ ఒక భారతీయుడు.. బెంగాలి” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అమల. 


 
Recent Post