ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో పెళ్లి చేసుకుంటున్న బిగ్‌బాస్ ప్రేమజంట...!

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2019, 06:39 PM



బిగ్‌బాస్ సీజన్‌లో కంటెస్టెంట్ల మధ్య గిల్లికజ్జాలు, ప్రేమలు చిగురించడం చాలా కామన్. తెలుగులో సైతం ఈ ధోరణి ప్రారంభం అయ్యింది. మూడో సీజన్‌లో రాహుల్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ను బాగా కనెక్ట్ చేసింది. అయితే అలాంటి కెమిస్ట్రీనే ఇతర బిగ్ బాస్ సీజన్లలో సైతం కొనసాగింది. తాజాగా కన్నడ బిగ్‌బాస్ సీజన్ ఆరులో పాల్గొన్న చందన్ శెట్టి, నివేదితా గౌడల పరిచయం ప్రేమగా మారింది. వీరు బిగ్‌బాస్ సీజన్-6లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కలిసివచ్చింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా  వీరి ప్రేమ కొనసాగింది. ఇటీవల దసరా ఉత్సవాలను పురస్కరించుకొని మైసూరులో ఓ వేదికపై తమ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా చందన్, నివేదితల బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తామని వారిద్దరూ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com