ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు ఫోర్త్ క్లాస్‌లోనే లవ్ లెటర్ వచ్చింది: నిధి అగర్వాల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2019, 06:58 PM



తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజియస్ట్ షో ఫీట్ అప్ విత్ ది స్టార్స్. మంచు లక్ష్మీ హోస్టుగా ఉన్న ఈ షోలో చాలా వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారు స్టార్స్. ఇందులో ఇప్పటికే సమంత, నిఖిల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్లు వచ్చారు. ఇక తాజాగా ఈ షోలో నిధి అగర్వాల్ పాల్గొంది. ఈమె కూడా ఇప్పుడు తన లైఫ్‌లోని చాలా సీక్రెట్స్‌ను బయట పెట్టింది. తన రిలేషన్ స్టేటస్ గురించి కూడా ఓపెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. మొన్నటి వరకు తనకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని.. కానీ అతడితో ఇప్పుడు విడిపోయానని చెప్పింది నిధి. విడిపోయిన తర్వాత ప్రస్తుతం తాను సింగిల్ అని సిగ్నల్స్ ఇచ్చింది నిధి అగర్వాల్. సినిమా ఇండస్ట్రీ నుంచి తనకు ఎవరూ బాయ్ ఫ్రెండ్ లేరని తేల్చేసింది ఈ బ్యూటీ. ఈమెకు క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో లవ్ ఎఫైర్ ఉందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు అలాంటివేమీ లేవని.. తన రిలేషన్ షిప్ స్టేటస్ సింగిల్ అని క్లారిటీ ఇచ్చింది ఈ భామ. తనతో పాటు ఇప్పుడు తన చెల్లి కూడా సినిమా ఇండస్ట్రీలోకి వస్తానని చెబుతుందని.. అయితే తాను మాత్రం అలా చేయొద్దని చెబుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది నిధి. దానికి కారణం కూడా లేకపోలేదు. తన చెల్లి అద్భుతంగా చదువుతుందని.. అలాంటి అమ్మాయి ఇండస్ట్రీకి అవసరం లేదని అనిపిస్తుందని చెప్పింది నిధి. ఇక తన చదువు విషయానికి వస్తే తనకు ఫోర్త్ క్లాస్‌లోనే లవ్ లెటర్ వచ్చిందని.. అప్పుడు లెటర్ రాసిన వ్యక్తి ఇప్పటికీ మంచి ఫ్రెండేనని చెప్పి సంచలనం రేపింది నిధి. తనకు తొలి క్రష్ షారుక్ ఖాన్ అని చెప్పింది నిధి. తనకు బాయ్ ఫ్రెండ్స్ అవసరం లేదని.. రాముడి లాంటి భర్త కావాలంటుంది నిధి అగర్వాల్. మొత్తానికి తన జీవితంలో జరిగిన చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com