ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సో మెనీ సో మెని సాంగ్ టీజర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2017, 01:00 PM



శ్రీరస్తు శుభమస్తు మూవీ తో హిట్ అందుకున్న అల్లు శిరీష్ , ఆ మూవీ ఇచ్చిన జోష్ తో తదుపరి చిత్రాల ఫై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఎక్కడికిపోతావు చిన్నవాడా మూవీ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం అనే మూవీ తో వస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొనే పని లో ఉంది. ఈ నెల 23 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నేపథ్యం లో చిత్ర యూనిట్ సినిమాలోని ఒక మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసింది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఆ సాంగ్ కొంచెం కొత్తగా ఉంది. సో మెనీ సో మెని.. అంటూ లిరిక్స్ తో మొదలవ్వడం చూస్తుంటే యూత్ కు ఈ ఒసొంగ్ బాగా ఆకట్టుకునే విధంగా ఉందనిపిస్తోంది. రామజోగయ్య శాస్త్రి రచన అందివ్వగా , అనురాగ్ కులకర్ణి – సాహితి గాత్రం చేసారు. ఇక ఈ మూవీ ఫై మెగా అభిమానులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. మరి వారి అంచనాలను ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలి. ఈ లోపు ఈ సాంగ్ ను చూసెయ్యండి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com