ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ కొత్త మూవీ ప్రారంభం

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2019, 09:37 AM



వరుస పరాజయాలతో గెలుపు కోసం పరితపిస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. తాజాగా రవితేజ  'డిస్కో రాజా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 24న విడుదల కానుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రవితేజ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది.


గోపీచంద్ మలినేనితో కలిసి రవితేజ అనేక సినిమాల్లో నటించాడు. వీరి కాంబినేషన్ లో డాన్ శ్రీను, బలుపు సినిమాలు వచ్చాయి. ఈ సినిమా రవితేజకు 66వ సినిమా. ఈ చిత్రం షూటింగును ఇవాళ హైదరాబాదులో ప్రారంభిస్తుండడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇది రవితేజకు 66 మూవీ. ఈ మూవీకి క్రేక్ అని ఫిక్స్ చేశారు.డిస్కోరాజాతో పాటు ఈ మూవీపై రవితేజ అనేక ఆశలు పెట్టుకున్నాడు. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com