రష్మీ గౌతమ్ డేట్స్ కోసం నిర్మాతలు ఎగబడే స్థాయికి వచ్చేసింది పరిస్థితి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అటు సినిమాలు.. ఇటు టెలివిజన్ షోలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం టీవీ తెరపై మాత్రమే వస్తుంది. వెండితెరపై హీరోయిన్గా రాణిద్దామనుకున్న రష్మీ గౌతమ్ ఆశలు అడియాసలే అయ్యాయి. అందుకే ఇక నుంచి సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ఒకవేళ కంటెంట్ బాగుంటేనే సినిమాల్లో యాక్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఏ స్టోరీ పడితే ఆ స్టోరీని ఒకే చేయకుండా... పూర్తిగా స్క్రిప్ట్‌తో పాటు తన పాత్ర నచ్చితేనే సినిమాలను ఓకే చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తాజాగా రష్మీ గౌతమ్.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం అనసూయను అనుకున్నారు. కానీ అనసూయ ఆల్రెడీ తనకు కమిటైన ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు డేట్స్ కేటాయించలేకపోయింది.